సెలబ్రెటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన వేణు స్వామి కొంతమంది హీరోల విషయంలో చెప్పిన విషయాలు రివర్స్ అవ్వడంతో చాలాసార్లు ట్రోలింగ్ కి గురయ్యారు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానుల చేత ట్రోలింగ్ కి గురయ్యారు.అయితే ప్రభాస్ తో సినిమాలు చేసే నిర్మాతలు జాతకాలు చూయించుకోవాలని, ఆయనతో సినిమాలు చేస్తే నిర్మాతలు ఇబ్బందులు పడతారని , ప్రభాస్ లాంటి జాతకం టాలీవుడ్ లో రాజమౌళికి ఉందని, వీరిద్దరికే ఇలాంటి ఒక విచిత్రమైన జాతకం ఉందని,ప్రస్తుతం ప్రభాస్ జీవితంలో హైట్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు రాబోయేవన్నీ ఫ్లాప్సే. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఫ్లాపే అవుతుంది.. అని వీడియో పోస్ట్ చేయడంతో చాలామంది ప్రభాస్ అభిమానులు ఆయన్ని ట్రోలింగ్ చేశారు.
ప్రభాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి అన్నారు కదా మరి కల్కి 2898 ఏడి,సలార్ సినిమాలు ఎలా హిట్ అయ్యాయి అని ప్రశ్నించారు. ఆ తర్వాత ప్రభాస్ అభిమానుల ట్రోలింగ్ తో మరో వీడియో కూడా పెట్టారు. అసలు సలార్ హిట్ కాలేదు.హిట్ అయినట్టు బయటికి వచ్చి కేకులు కట్ చేసారు తప్ప నిర్మాతకి పెద్ద బొక్కే.. ప్రభాస్ కి హెల్త్ బాలేదు ఆయనకు అసలు పెళ్లి కాదు.. కానీ ప్రభాస్ పెళ్లి ఎందుకు కాదు అనేది ఆయనే ఆలోచన చేయాలి.ప్రభాస్ ముందు సినిమాలో చేసినట్లుగా డాన్స్ లు ఎందుకు చేయడం లేదు. మిర్చిలో చేసినట్టు ఇప్పుడు డాన్స్ ఎందుకు చేయడం లేదు.
ఫైటింగ్స్ చేసే సమయంలో ఛత్రపతిలో చేసినట్టు కాలు పైకి ఎత్తి వార్నింగ్లు ఎందుకు ఇవ్వడం లేదు. ఒక అభిమానిగా నా నుండి ప్రభాస్ కి ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. ప్రభాస్ మళ్ళీ ఎప్పటిలాగే డ్యాన్స్ లు,ఫైట్లు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఆరోగ్యంగా ఉండి పది కాలాలపాటు చల్లగా ఉండాలి అనేదే నా కోరిక..అంటూ ఆ వీడియోలో ఉంది.అయితే అప్పటి వీడియోని మళ్ళీ ఇప్పుడు వేణు స్వామి రాజాసాబ్ డిజాస్టర్ తో మళ్ళీ రీ పోస్ట్ చేయడంతో చాలామంది ప్రభాస్ అభిమానులు వేణు స్వామి పై మండిపడుతున్నారు. సైలెంట్ గా ఉన్న మమ్మల్ని మళ్ళీ ఎందుకు కెలుకుతారు అంటూ ఫైర్ అవుతున్నారు.