వార్ -2 రిలీజ్ డేట్ 2025 లో ఫిక్సయిందా..?

Divya
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వార్ -2. ఇందులో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా హృతిక్ రోషన్ కూడా నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎప్పుడో మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోలు లేకుండానే ఈ సినిమా షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ సెట్లోకి హృతిక్ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఈ సినిమా కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు హృతిక్ రోషన్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. తాజాగా వార్-2 సినిమాని విడుదల తేదీ సమయాన్ని సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తెలియజేయడం జరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతోందని అందరూ భావించారు కానీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మరింత పొడిగించడం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది అంటూ తెలియజేయడం జరిగింది ఈ రిలీజ్ డేట్ చాలా లాంగ్ వీకెండ్తో వస్తోంది. అంటే గురువారం రోజున ఈ సినిమా విడుదల అవుతుంది అంటు తెలియజేయడం జరిగింది ఇక ఆ మరుసటి రోజున ఇండిపెండెన్స్ డే కావడంతో పాటు..16,17 వీకెండ్ కావడం చేత వార్-2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సెండ్ సైతం అందుకని అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. YRF స్పై యూనివర్సిటీలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రం మొత్తానికి ఎన్టీఆర్ విలన్ గా నటించబోతున్నారని.. సల్మాన్ ఖాన్, షారుక్, హృతిక్ రోషన్ అందరూ కలిసి ఎన్టీఆర్ ని ఓడించడానికి పోరాటం చేస్తూ ఉంటారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: