మహేష్ సినిమా సూర్తితోనే అలా చేసిన యువకుడు....!!
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీమంతుడు . ఈ సినిమాలో మహేష్ బాబు తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామంలో ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులను సమకూరుస్తూ గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి కారణమవుతారు. అయితే ఈ సినిమాలో నటించినటువంటి మహేష్ బాబు కూడా తన సొంత గ్రామానికి ఏమైనా చేయాలని తన సొంత గ్రామం అయినటువంటి బుర్రపాలెంను దత్తత తీసుకొని అక్కడ ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.
ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది స్ఫూర్తి పొందే ఉంటారని చెప్పాలి. అయితే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా చూసి ఖమ్మం జిల్లా కు చెందినటువంటి 10 సంవత్సరాల రఘునందన్ అనే బాలుడు తన గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ పాఠశాలను దత్తత తీసుకున్నారు. పది సంవత్సరాల వయసులోనే ఎంతో గొప్ప, పెద్ద మనసు చాటుకున్నటువంటి రఘునందన్ తన వద్ద దాచుకున్నటువంటి 1500 రూపాయలతో పాటు తన తండ్రి వద్ద కొంత డబ్బును తీసుకొని ముందుగా తన గ్రామంలోని పాఠశాలలో మొక్కలను నాటించారు.
ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా లేదా ఇతర కార్యక్రమాల ద్వారా కూడా పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు పాఠశాలలో బెంచెస్ అలాగే వాటర్ సదుపాయం కల్పించడం, నోట్ బుక్స్ లేనివారికి బుక్స్ అందించడం ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆ పాఠశాల అభివృద్ధికి సహాయపడ్డారు. ఇలా ఇంత చిన్న వయసులోనే రఘునందన్ చేస్తున్న పని ఎవరికి చెప్పుకోలేదు. ఇక ఆ జిల్లాలో ఉత్తమ పాఠశాలగా ఈ మల్లవరం మండల పరిషత్ పాఠశాలకు అవార్డులు కూడా వచ్చాయని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రఘునందన్ తెలిపారు. రఘునందన్ ప్రస్తుతం హైదరాబాదులో ఇంటర్ చదువుతున్నారని తెలియచేశారు. ఇలా ఖమ్మం జిల్లాలోని మల్లవరం మండల పరిషత్ పాఠశాల రూపురేఖలను రఘునందన్ మార్చేశారు. ఇక ఈయనని స్ఫూర్తిగా తీసుకొని తన స్నేహితులు కూడా కొంతవరకు సహాయం చేశారని రఘునందన్ వెల్లడించారు. పది సంవత్సరాల వయసులోనే ఎంతో పెద్ద బాధ్యత తీసుకొని పాఠశాల అభివృద్ధికి దోహదం చేసినటువంటి రఘునందన్ గురించి ఈ విషయాలు బయటకు రావడంతో ప్రతి ఒక్కరు కూడా రఘునందన్ పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా సినిమాల నుంచి మంచిని స్ఫూర్తిగా పొంది సామాజిక సేవ చేయటం ఎంతో గొప్ప నిర్ణయం అంటూ ఈయన మంచితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ సమాజంలో ఎలాంటి సమస్యలు ఉండవని రఘునందన్ పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.