అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న మూవీ ‘యానిమల్’. అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, హాట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రధాన పాత్రలు చేస్తున్నారు.బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఇంకా మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల కానుంది. రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ పనులని కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక రన్ టైమ్ విషయానికి వస్తే 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెలియజేశారు.
ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని 3 నిమిషాల లాంగ్ నిడివితోనే రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ మొత్తం కూడా ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చుట్టూనే తిరిగింది. ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా అర్ధమవుతుంది.అయితే సినిమా మొత్తం హిందీ యాక్టర్స్ తోనే నిడిపోయినా.. సౌత్ నేటివిటీకి తగ్గట్టు కూడా మూవీ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.ఇక ఈ ట్రైలర్ తో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ కావడంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మూవీతో సందీప్ రెడ్డి వంగా మరోసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.బ్రహ్మస్త్ర, శంషేరా వంటి భారీ ప్లాపులు ఎదురుకున్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.