వివాహ బంధంతో ఒక్కటైన హీరోయిన్ కార్తీక నాయర్..!!

Divya
సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ అటు కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. పలు సినిమాలలో నటించిన పెద్దగా క్రేజ్ రాలేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పలు రకాల బిజినెస్లను సైతం చూసుకుంటూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గత కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ రోజున ఈమె వివాహం అంగరంగ వైభవంగా కేరళ సంప్రదాయ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి . కార్తీక పెళ్లికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

ఈ వేడుకకు చిరంజీవితో పాటు పలువురు సీనియర్ హీరోయిన్స్ కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం కార్తీక పెళ్లి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కార్తీక నాయర్ మొదట నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా హిట్ కాలేదు.. ఆ తర్వాత జీవ నటించిన రంగం సినిమాతో తెలుగు, తమిళ్ భాషలలో మంచి విజయాన్ని అందుకోవడంతో మరింత క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన పేరు రాకపోవడంతో పాటు విమర్శలు కూడా వినిపించాయి.

దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోనే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత తమ కుటుంబానికి సంబంధించిన పలు వ్యాపార సంస్థలను దుబాయిలో మెయింటైన్ చేస్తూ కుంటున్నట్లుగా తెలుస్తోంది. కార్తీక నాయర్ రోహిత్ మీనా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది ఈయన కూడా బిజినెస్ రంగంలోనే రాణిస్తున్నట్టు సమాచారం.. మరి వివాహ బంధంతో నైనా కార్తీక నాయర్ తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: