మహేష్ కి పోటీగా విజయసేతుపతి..!!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా విలన్ గా పేరు సంపాదించిన విజయ్ సేతుపతి బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన తాజా చిత్రం మేరి క్రిస్మస్.. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జవాన్ సినిమాతో నార్త్ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మేరీ క్రిస్మస్ సినిమాతో మరొకసారి అలరించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా వేస్తూ వస్తున్నారు. చివరికి ఈ ఏడాది చివరిలో డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు.. కానీ ఇప్పుడు ఈ సినిమా మరొకసారి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికీ విడుదలైన పోస్టర్లతో ఈ సినిమాకు మంచి క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయాలని చిత్ర బృందం భావించగా ఆ సమయానికి షారుక్ ఖాన్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు విడుదల కావడంతో మరొకసారి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది.

వినిపిస్తున్న సమాచారం ప్రకారం మేరీ క్రిస్మస్ వచ్చేయేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని కొత్త పోస్టర్తో విడుదల చేశారు.. ఈ సినిమా హిందీ తమిళ్ భాషలలోనే ఏకకాలంలో తెరకెక్కించారు. ఇందులో కీలకమైన పాత్రలో రాధిక ఆప్టే, సంజయ్ కపూర్ ,గాయత్రి శంకర్ తదితరులు సైతం నటించారు. ఇక తమిళంలో రాధికా శరత్ కుమార్, రాజేష్ విలయంస్ తదితరులు సైతం నటించారు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీ ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి ఈ సినిమాతో సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: