నిరాశపరుస్తున్న 'అదుర్స్' రీరిలీజ్ అడ్వాన్స్డ్ బుకింగ్స్....!!
అయితే 'సింహాద్రి ' చిత్రం కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే సినిమా అని, మామూలు ఆడియన్స్ లో ఆ చిత్రానికి పెద్దగా క్రేజ్ లేదని, అందుకే రికార్డు పెట్టలేకపోయామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. 'అదుర్స్' చిత్రం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రం అని, ఈ సినిమా తో ఎవ్వరూ ముట్టుకోలేని రికార్డ్స్ ని నెలకొల్పుతాము అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సవాలు చేసారు. అనుకున్నట్టుగానే 'అదుర్స్' చిత్రాన్ని 4K కి మార్చి, ఈ నెల 18 వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ కి ప్లాన్ చేసారు. కచ్చితంగా రికార్డు పెడుతుంది అనుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. ముఖ్యమైన సిటీలలో కూడా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ ముందుకు కదలకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ సినిమాకి కనీసం 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా లేదని అంటున్నారు.ఈ చిత్రం 4K కి మార్చడానికి దాదాపుగా 20 లక్షల రూపాయిలు ఖర్చు అయ్యింది. ఆ తర్వాత పబ్లిసిటీ చెయ్యడానికి మరో 5 లక్షల రూపాయిలు ఖర్చు అయ్యింది. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే కనీసం 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. 20 లక్షల రూపాయిలు వచ్చే ఛాన్స్ కూడా కనిపించకపోవడం తో నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.