సినిమా ఇండస్ట్రీలో.. ట్విన్స్ లాగా కనిపించే హీరోలు వీళ్లే?

praveen
సాధారణంగా ఈ భూమి మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉన్నారు అని చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమే అని కొంతమందిని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల పోలికలు కలిగి ఉన్న ఇతరుల ఫోటోలు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హీరోని పోలిన మరో హీరో ఉన్నాడా అంటే కొంతమందిని చూస్తే ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలా  సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోని పోలి ఉన్న ఇతర హీరోలు ఎవరో తెలుసుకుందాం..

 అమితాబచ్చన్ - సోను సూద్  : బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ కొన్ని ఫోటోలు చూస్తే అచ్చం ప్రస్తుతం సినిమాల్లో విలన్ గా చేస్తున్న సోను సూద్ ను  చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటాయి  బిగ్ బి కుర్రాడిగా ఉన్నప్పుడు అచ్చం సోను సూద్ లాగానే కనిపించేవాడు.
 మహేష్ బాబు - ప్రిన్స్  : టాలీవుడ్ లో అందగాడిగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పోలికలను అటు యంగ్ హీరో ప్రిన్స్ కలిగి ఉన్నాడు. ఈ ఇద్దరిని పక్కన నిలబెట్టి చూస్తే అన్నదమ్ములేమో అని అనుకుంటారు అందరు.
 చరణ్ -  యష్  - టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ క్రేజీ హీరో యాష్ ఇద్దరు కూడా ఒకే తల్లి బిడ్డలేమో అన్నట్లుగా అటు పోలికలను కలిగి ఉంటారు అని చెప్పాలి. కొన్ని యాంగిల్స్ తో చూస్తే అక్కడ ఉన్నది ఎవరు అని గుర్తు పట్టడం కూడా కష్టమే.

 ధనుష్ - ప్రదీప్ రంగనాథన్  : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. లవ్ టుడే ఫెమ్ ప్రదీప్ రంగనాథన్ ఇద్దరూ కూడా సేమ్ లుక్ లో ఉంటారు. ఇద్దరు ట్విన్స్ అన్నట్లుగానే కొత్తగా చూసినవారు అనుకుంటూ ఉంటారు.
 విజయ్ - విక్రాంత్ - జై  : దళపతి విజయ్ పోలికలతోనే హీరో విక్రాంత్ కూడా ఉంటాడు  ఇక అచ్చం ఇలాగే హీరో జై కూడా దళపతి విజయ్ పోలికలు కలిగి ఉంటాడు.

 నాని -  శివ కార్తికేయన్  : టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ ఇద్దరు కూడా ఒక కొన్ని యాంగిల్స్ లో చూస్తే ఒకేలా కనిపిస్తూ ఉంటారు.
 రామ్ - అరుణ్ అజిత్  : ఈ ఇద్దరు హీరోల మధ్య అయితే కనీసం కాస్తయినా తేడా ఉండదు. ఒకరికి ఒకరు జిరాక్స్ కాపీ అన్నట్లుగానే వీరి మధ్య పోలికలు ఉంటాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: