రివ్యూ: జపాన్ మూవీ రివ్యూ.. కార్తీ సక్సెస్ కొట్టినట్టేనా..?

Divya
కోలీవుడ్లో ఎప్పుడూ కూడా ప్రయోగాత్మకంగా చిత్రాలలో నటించే నటులలో కార్తీ కూడా ఒకరు.. తాజాగా జపాన్ చిత్రంతో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. యాక్షన్ కామెడీ త్రిల్లర్ కథ అంశంతో తెరకెక్కించిన ఈ సినిమాకి డైరెక్టర్ రాజు మురగన్ దర్శకత్వం వహించారు. ఇందు లో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటించినది. కార్తి కేరియర్ లోని 25వ చిత్రంగా ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలలో భారీ అంచనాల మధ్య విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

జపాన్ సినిమా ప్రీమియర్ షో కి పాజిటివ్ టాక్ లభించాయి. సినిమాలో దొంగగా కార్తి యాక్టింగ్ అద్భుతంగా ఉందని.. చాలా కొత్తగా ఉందని ఫ్యాన్స్ సైతం ట్విట్టర్లో తెలుపుతున్నారు. కార్తీ కామెడీ టైమింగ్ జపాన్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ గా మారిపోయిందని తెలుపుతున్నారు.. కార్తీ వన్ మ్యాన్ షో గా ఈ సినిమాలో నిలిచారని అభిమానులు సైతం తెలుపుతున్నారు. డైరెక్టర్ రాజు మురుగన్ కూడా ఈ సినిమాని చాలా ప్లాన్ ప్రకారం నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

మరొక నేటిజన్ జపాన్ చిత్రానికి ఫస్ట్ ఆఫ్ కాస్త డ్రా బ్యాక్ అంటూ తెలుపగా సెకండాఫ్ మాత్రం డైరెక్టర్ త్రిల్లింగ్గా చేశారని తెలిపారు.. బ్యాక్ గ్రౌండ్ బిజీ అని కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని కథలోని ఫీల్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో జీవి బాగా ఎలివేట్ చేశారని తెలుపుతున్నారు.

ఇక హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గ్లామర్ కూడా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని ట్విట్ చేస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ సైతం ఏవిధంగా రాబడుతుందో చూడాలి మరి. కార్తీ జపాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారా లేదా అనే విషయం తెలియాలి అంటే మరో కొన్ని గంటలు ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: