యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన స్పై యూనివర్స్ సినిమాలలో ఏక్తా టైగర్ టైగర్, టైగర్ జిందా హై సినిమాలతో సల్మాన్ ఖాన్ సాలిడ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. వాటి తరువాత ఇప్పుడు సల్మాన్ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టలేదు. అందుకే హిట్టు కోసం మళ్ళీ యష్ రాజ్ నే నమ్ముకున్నాడు సల్మాన్ భాయ్.ఇప్పుడు బాలీవుడ్ బాబులు హిట్లు కోసం స్పై సినిమాల మార్కెట్ ను భారీగా పెంచేశారు.టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన క్యారెక్టర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజీ లభించింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా టైగర్ 3 ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కత్రినా కైఫ్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసింది.టైగర్ 3 ఈనెల 12వ తేదీన గ్రాండ్గా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు.హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కత్రినా కైఫ్ టవల్ ఫైట్ క్లిప్ అయితే గత కొద్ది రోజుల నుంచి నెట్టింటా వైరల్ గా మారుతోంది. ఇక మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే బుకింగ్స్ లో మాత్రం పెద్దగా జోరు కనిపించడం లేదు.
షారుఖ్ పఠాన్, జవాన్ రేంజ్ లో బుకింగ్స్ వస్తాయి అనుకుంటే ఆ సినిమా దారిదాపుల్లోకి కూడా రావట్లేదు టైగర్. ఈ దీపావళి పండుగ సందర్భంగా టైగర్ 3 సినిమాని రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి బుకింగ్స్ పెరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ షారుఖ్ దిగి రావాలేమో అన్నట్లుంది పరిస్థితి.ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తేనే నెక్స్ట్ స్పై సినిమాలకి హైప్ పెరిగిద్ది. నెక్స్ట్ వచ్చే స్పై యూనివర్స్ లో మన టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కూడా భాగమయ్యారు.హృతిక్ రోషన్ తో వార్ 2 లో నటిస్తున్నాడు ఎన్టీఆర్. టైగర్ 3 హిట్ అయితే ఖచ్చితంగా వార్ 2 పై అంచనాలు ఉంటాయి. అందువల్ల మన యంగ్ టైగర్ కి గ్రాండ్ ఎంట్రీ దక్కిద్ది. కానీ టైగర్ 3 బుకింగ్స్ చాలా పేలవంగా వున్నాయి. మరి చూడాలి ఏమవుతుందో.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు. ఒక్క పోస్టర్ తప్ప ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి ఒక్క అప్డేట్ రాలేదు. దీపావళికి కూడా అప్డేట్ వచ్చేలా లేదు.