BiggBoss 7 : తేజ ఎలిమినేట్ అయితే వాళ్లు సూపర్ హ్యాపీ..!

shami
బిగ్ బాస్ సీజన్ 7 లో 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. యూట్యూబర్ గా హౌస్ లోకి వచ్చి తన కామెడీతో అందరినీ అలరించిన తేజ హౌస్ లో శోభాతో కాస్త అతి చేశాడని అనిపిస్తుంది. తనకు తెలివితేటలు ఉన్నా దాన్ని సరైన విధంగా వాడలేదని మరో హౌస్ మెట్ శివాజి అంటుంటాడు. ఈ సీజన్ మొదట్లో రెండు మూడు వారాలు నామినేషన్స్ లో ఉన్న తేజ కొద్దిగా కాన్ ఫిడెంట్ గా మారాడు. అయితే గేం ఆడకుండా అతను అంతా కవరింగ్ చేస్తూ వస్తున్నాడు. అదే అతని మీద నెగిటివ్ అయ్యేలా చేసింది.

బిగ్ బాస్ లో రానున్న రోజులు టఫ్ ఫైట్ జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ టైం పాస్ చేస్తే సరిపోదు. అందుకే తేజని ఎలిమినేట్ చేశారు ఆడియన్స్. ప్రతి టాస్క్ లో తమ 100 పర్సెంట్ ఇస్తేనే ఆడియన్స్ వారికి ఓటేస్తారు. అంతేకాదు కొన్ని విషయాల్లో తెలియకుండానే ఫౌల్ గేం ఆడుతుంటారు. ఆ టైం లో ఆడియన్స్ దృష్టిలో వారికి నెగిటివ్ మార్కులు పడతాయి.

తేజ ఎలిమినేట్ అవడం వల్ల వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి రీజన్స్ లేకుండా తేజ వారిని నామినేట్ చేస్తే వారు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. తేజ నామినేట్ చేశాడు అంటే వాళ్లు బయటకు వెళ్లాల్సిందే అన్న టాక్ వచ్చేసింది. మొత్తానికి తేజ బిగ్ బాస్ జర్నీ పూర్తైంది. హౌస్ అంతా సందడి చేసే తేజ ఎలిమినేషన్ హౌస్ మెట్స్ లో కాస్త బాధ కలిగించింది. ఇక ఈ వారం హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ని మహారాణులుగా చేసి వాళ్లని నామినేషన్ నుచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారన్నది చూడాలి. ఇక మీదట ప్రతి నామినేషన్ చాలా ప్రాధాన్యత ఏర్పరచుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: