జవాన్ మూవీ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ అట్లీ...!!
ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప నిర్మాత కూడా. ఖర్చు విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కారు. దర్శకుల దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు మరియు తోటి నటీనటుల వరకూ అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తారు.
ఆయనతో పని చేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. 'జవాన్' తర్వాత నా సినిమా భావజాలం గ్రాఫ్ ఎంతో మెరుగయ్యాయి. దర్శకుడిగా నా ఐదో సినిమానే షారుఖ్ తో చేయడం ఎంతో అదృష్టం. వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ నేనెంతో ఆనందంగా ఉన్నాను..ఈ సినిమా విడుదలకు ముందు నేను ఎంతో ఒత్తిడికి గురయ్యాను. అది ఎప్పటికీ మరచిపోలేను. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాక షారుక్‌తో కలిసి 'జవాన్' సినిమాను చూశాను.మేము సినిమా కోసం ప్రయత్నం వంద శాతం చేశామని దేవుడిని ప్రార్థించాం.
అదే సక్సెస్‌ని ఇచ్చింది'' అని అన్నారు. ఇంకా దీపికా పడుకొణే గురించి కూడా అట్లీ చెప్పుకొచ్చారు..ఈ కథ ను చెప్పగానే ఆమె అంగీకరించారు. కళ్లతోనే హావభావాలు పలికించడం ఆమెలో ఉన్న గొప్ప ప్రతిభ. సన్నివేశంలో ఏదైన మార్పు చెబితే వెంటనే దానికి తగ్గట్టు మౌల్డ్ అయిపోతారు..సీన్స్ కు తగట్టు లుక్స్ మార్చి పాత్రలో లీనమైపోతారు.. అందుకే డైలాగులు చెప్పే సమయంలో ఎక్కువగా క్లోజప్ షాట్స్ తీశాను'' అని దర్శకుడు అట్లీ తెలిపారు.