ఆర్ఎక్స్ 100 మూవీ తో అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి.. `మంగళవారం` అంటూ మరో వైవిధ్యమైన సినిమా తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.హార్రర్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర ను పోషించింది. నందితా శ్వేతా, అజయ్ ఘోష్, రంగం ఫేమ్ అజ్మల్, కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్ర లను పోషించారు.ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ల పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. పోస్టర్స్, టీజర్ తోనే ఆడియెన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసిన చిత్ర యూనిత్.. తాజా గా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద గా మంగళవారం ట్రైలర్ ను విడుదల చేయించారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆద్యంతం ఉత్కంఠ భరితం గా సాగుతూ సినిమా పై భారీ అంచ నాలు పెంచేసింది.
ఒక ఊరి లో ప్రతి మంగళవారం మరణాలు సంభవిస్తుంటాయి. ఆ మరణాల వెనక మిస్టరీ ఏంటి.. మంగళ వారమే ఎందుకు చనిపోతున్నారు.. ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు.. వంటి ఎన్నో ప్రశ్నలను లేవదీ స్తూ వణుకు పుట్టించే సన్నివేశాల తో ట్రైలర్ ను కట్ చేశారు. అజయ్ భూపతి మార్క్ బోల్డ్ శృంగార సన్నివేశాలు కూడా ట్రైలర్ లో ఉన్నాయి. పాయల్ మరోసారి తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అజనీష్ లో కనాథ్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ థ్రిల్ కలిగించింది. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదిరి పోయిందనే చెప్పాలి. మరి సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుం టుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.