ఆ కారణంగానే యానిమల్ మూవీను రిజెక్ట్ చేసిన సమంత....!!
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ పాటలు కనుక చూస్తే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ విపరీతంగా ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు అధికంగా ఉన్నాయని సందీప్ రెడ్డివంగా చెప్పగానే చెప్పేశారు. అయితే ముందుగా ఈ సినిమాలో నటించే అవకాశం రష్మికకు కాకుండా హీరోయిన్ సమంతకు వచ్చిందట. అయితే ఈ సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని విషయం తెలిసినటువంటి సమంతా తాను ఈ సినిమాలో నటించడం కుదరదని ఇలాంటి సినిమా మరే హీరోయిన్ నటించిన బాగుంటుందేమో కానీ నేను నటిస్తే బాగుండదు అంటూ ఈ అవకాశాన్ని వదులుకున్నారట.సమంత ఈ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమే అంటూ ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు భావిస్తున్నారు. సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న ఈమె ఇలాంటి రొమాంటిక్ సన్ని వేశాలలో నటించడం వల్ల తనపై నెగటివ్ ప్రభావం అధికంగా పడుతుందన్న కారణంతోనే సమంత సినిమా అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తోంది.