మెగా బ్లాక్ బస్టర్ 'శంకర్ దాదా MBBS' రీరిలీజ్..!!

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మన మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు.
మెగాస్టార్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చిత్రాలు రీ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ లో  లో మెగాస్టార్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇంతకీ రీ రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి? డీటెయిల్స్ లోకి వెళ్తే.. ఈమధ్య థియేటర్స్ లో స్ట్రైట్ సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మన టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పీక్స్ కి చేరింది. 


ఇప్పుడు ఇదే ట్రెండ్ ని ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి రీరిలీజ్ అయిన చాలా సినిమాలు మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి. వాటిలో కొన్ని మూవీస్ అయితే ఒరిజినల్ రిలీజ్ టైం లో వచ్చిన కలెక్షన్స్ కంటే ఇప్పుడు రాబట్టిన కలెక్షన్స్ ఎక్కువగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబిబిఎస్' చిత్రాన్ని మళ్లీ రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. జయంత్ సి పరాంజీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2004 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం ఏకంగా వంద రోజులు ఆడింది. ఇందులో మెగాస్టార్ సరసన సోనాలి బింద్రే కథానాయికగా నటించగా శ్రీకాంత్, పరేశ్


 రావల్ ముఖ్య పాత్రలు పోషించారు. హిందీలో వచ్చిన 'మున్నాభాయ్ ఎంబిబిఎస్' చిత్రానికి ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కగా సెన్సేషనల్ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరాని ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ తో పాటు తెలుగులోనూ భారీ సక్సెస్ అందుకున్న 'శంకర్ దాదా ఎంబిబిఎస్' మూవీ ని దాదాపు 19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేయబోతుండడం విశేషం. నవంబర్ 4వ తేదీన ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా 'బోలాశంకర్' తో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అందుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: