ఏంటి.. రామ్ చరణ్ వల్ల లియో సినిమా ఫ్లాప్ అవ్వబోతుందా..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లియో. లోకేష్ కనగరాజ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో చెన్నై సోయగం త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతోపాటు సంజయ్ దత్ అర్జున్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో పాటు మరికొందరు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ జగదీష్ పళని సామి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ  మోస్ట్ అవైటెడ్ సినిమా అక్టోబర్ 19 విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

 ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే లియో సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. అయితే ఒకటి టికెట్ బుకింగ్ వెబ్సైట్ లో సినిమాలోని నటీనటుల వివరాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా ఉంది అని తెలిపారు. దీంతో లియో సినిమాలో

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దళపతి అభిమానుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిసికా భాయ్ కిసిక జాన్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ పాత్రల్లో కనిపించడు. కట్ చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు అదే సెంటిమెంటు లియో సినిమాలో కూడా రిపీట్ అవుతుందేమో అని విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. చూద్దాం చివరికి ఏమవుతుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: