తెలుగులో విడుదలకు ముందే రూ.100కోట్లు రాబట్టిన చిత్రాలు ఇవే..!

Divya
సాధారణంగా హీరోని బట్టి, హీరో మార్కెట్ ని బట్టి సినిమా కలెక్షన్లు రాబడుతూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో కథ కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా కంటెంట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే పెద్దపెద్ద హీరోలు తమ సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కించి రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలు కూడా విడుదలకు ముందే రూ .100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించి రికార్డు సృష్టిస్తున్నాయి. మరి తెలుగులో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ.100 కోట్లు రాబట్టిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాహుబలి 2:
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలైన తర్వాత రూ .1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించిన ఈ సినిమా 2017 లో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు బాహుబలి తీసుకొచ్చిన ఇమేజ్ తో ఈ సినిమా కు రూ .100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం గమనార్హం.
సాహో:
బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సాహో.. ఆ సినిమాల పరంపర కొనసాగుతూ ఈ సినిమాని కూడా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ప్రేక్షకులను అలరించలేదు కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇక ఈ సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ.100 కోట్లు రాబట్టింది.
వీటితోపాటు 2019లో వచ్చిన చిరంజీవి సైరా నరసింహారెడ్డి, 2021 లో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్, 2022 లో వచ్చిన రాధేశ్యామ్ తో పాటూ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య,  ఆది పురుష్ సినిమాలు విడుదలకు ముందే రూ .100కోట్లు రాబట్టాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా  అప్పుడే రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: