అదిరిపోయిన గుంటూరు కారం బిజినెస్ ..!!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గుంటూరు కారం భారీ బడ్జెట్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు నాగవంశీ. హీరోయిన్ల విషయానికి వస్తే శ్రీ లీల ,మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా వంటి సినిమాలు విడుదలయ్యాయి. అతడు సినిమా ఇంపాక్ట్ ఇప్పటికీ కూడా టీవీలలో కనిపిస్తూనే ఉంటుంది ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

అలా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత గుంటూరు కారం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఫన్ తో పాటు ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. గుంటూరు కారం సినిమా కూడా అంతకుమించి ఉండాలని భావిస్తున్నారు చిత్ర బృందం అందుకే ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి మళ్లీ కొత్తగా ఈ సినిమాని షూటింగ్ మొదలుపెట్టినట్లు గతంలో వార్తలు వినిపించాయి.
50% పైగా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది ఏ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు..గుంటూరు కారం సినిమా బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలలో 120 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్టుగా సమాచారం.. నైజాం ఏరియాలో 45 కోట్లు.. ఆంధ్రాలో 60 కోట్లు.. సీడెడ్ లో 15 కోట్లు.. ఇలా ఓవరాల్ గా 120 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగబోతుందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇలా మొత్తం కలుపుకొని దాదాపుగా 150 కోట్ల వరకు గుంటూరు కారం సినిమా బిజినెస్ జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయితే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: