కొరటాల శివ వ్యూహాలకు షాక్ లో తారక్ అభిమానులు !

Seetha Sailaja
కొరటాల శివ జూనియర్ ల కాంబినేషన్ లో షూటింగ్ దశలో ఉన్న ‘దేవర’ మూవీ రెండు భాగాలుగా వస్తుందని స్వయంగా కొరటాల శివ ప్రకటించడంతో ఈ మూవీకి కూడ సీక్వెల్ ఉండబోతోంది అన్న విషయం అధికారికంగా అందరికీ తెలిసిపోయింది. ఈ మూవీ కథ చాల పెద్దది అవ్వడంతో ఈ మూవీని రెండు భాగాలుగా తీయవలసి వస్తోందని కొరటాల శివ చెప్పిన విషయం తెలిసిందే.



వచ్చే సంవత్సరం ఉగాది రోజున ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుంది అన్న విషయం తెలిసిపోవడంతో ఈ మూవీ రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అన్నసందేహాలు జూనియర్ అభిమానులకు ఉన్నాయి. వాస్తవానికి ‘దేవర’ మూవీ షూటింగ్ పూర్తి అయ్యాక తారక్ హృతిక్ రోషన్ నటించవలసిన బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించవలసిన భారీ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి.



ఇప్పడు  ‘దేవర’ మూవీకి  సంబంధించి సీక్వెల్ కూడ ఉండబోతున్న పరిస్థితులలో ఈ సీక్వెల్ పూర్తి అయ్యేవరకు జూనియర్ మిగిలిన సినిమాలను మొదలుపెట్టడా లేదంటే మిగతా సినిమాలను చేస్తూనే ‘దేవర’ సీక్వెల్ ను పూర్తి చేస్తారా అన్న విషయమై క్లారిటీ లేకపోవడంతో తారక్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్. దీనికితోడు ఒక టాప్ హీరో నటించిన సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అయి ఆమూవీ క్లైమాక్స్ లో మంచి సస్పెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆసినిమా సీక్వెల్ పై అందరిలోనూ ఆశక్తి ఉంటుంది.



‘బాహుబలి’ ‘పుష్ప’ సినిమాల క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లు ఉండటంతో ఆమూవీల సీక్వెల్స్ గురించి అందరు ఆశక్తి కనపరిచారు. రాజమౌళి సుకుమార్ ల స్థాయిలో కొరటాల శివ ‘దేవర’ మూవీ క్లైమాక్స్ క్రియేట్ చేయలేకపోతే ‘దేవర’ సీక్వెల్ పై సగటు ప్రేక్షకుల్లో పెద్దగా ఆశక్తి ఉండదు అన్న విషయం తారక్ అభిమానులను భయపెడుతున్నట్లు టాక్..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: