రివ్యూ: రూల్స్ రంజాన్ సినిమాతో కిరణ్ అబ్బవరం సక్సెస్..!!

Divya
ఎప్పుడూ కూడా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు హీరో కిరణ్ అబ్బవరం.. మొదట రాజావారు రాణి గారు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి విజయాన్ని అందుకొని యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్న కిరణ్ అబ్బవరం సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సమయంలో తాజాగా రూల్స్ రంజాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.


కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగానే ఈ సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ తన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నట్లు ఆడియన్స్ తెలుపుతున్నారు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మంచి హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది. రూల్స్ రంజాన్ సినిమా ఫన్ రైడ్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.మొదటి భాగం ప్రేక్షకులకు బాగా నచ్చిందని సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదంటూ పలువురు ఆడియన్స్ తెలుపుతున్నారు.


రూల్స్ రంజన్ సినిమాలో కామెడీ ప్లస్ కాగ నేహా శెట్టి అందాలు కూడా మరింత ప్లస్సుగా నిలుస్తున్నాయి.. కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమా అని ఆడియన్స్ తెలుపుతున్నారు. దాదాపుగా ఎన్నో సినిమాల తర్వాత రూల్స్ రంజాన్ సినిమాతో కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకున్నారని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ని తీసుకువస్తోంది. ఈ సినిమాకి సమ్మోహనుడా అనే పాట కూడా మరింత ప్లస్ అయిందని తెలుస్తోంది. ఇందులో హైపర్ ఆది వెన్నెల కిషోర్ సుబ్బరాజ్ అజయ్ సుదర్శన్ తదితరులు సైతం నటించారు వీరందరి కామెడీ తో పాటు హర్ష హైపర్ ఆది వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్గా నిలుస్తోంది. డైరెక్టర్ రాతిన కృష్ణ ప్రేక్షకులకు అదిరిపోయి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ఇచ్చారని ప్రేక్షకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: