రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో స్కంద అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. శ్రీ లీల ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... శ్రీకాంత్ , ప్రిన్స్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు ప్రకటించారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
ఇక ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా మొదటి ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ఈ సినిమా విడుదలకు మధ్య చాలా గ్యాప్ రావడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ పేరుతో రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ రెండవ ట్రైలర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 12.92 మిలియన్ వ్యూస్ , 160.3 కే లైక్స్ లభించాయి.
ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఎలా ఉంటే ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.