లియో: ఆ దేశంలో సూపర్ క్రేజ్.. డే 1 రికార్డ్ పక్కా?

Purushottham Vinay
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన తదుపరి సినిమాని స్టార్ హీరో తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'లియో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేయడం జరిగింది.లియో సినిమా అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. రెండు రోజుల క్రితం ప్రారంభమైన పోస్టర్ విడుదలలో భాగంగా లియో నిర్మాతలు తాజాగా హిందీ పోస్టర్‌ను లాంచ్ చేశారు. కొత్త పోస్టర్‌లో తలపతి విజయ్, సంజయ్ దత్‌ని గొంతు పట్టుకున్నట్లు చూపించారు. ఈ సినిమాలో విజయ్ మరియు సంజయ్ దత్ మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్ సీన్స్ అనేవి చాలా బలంగా ఉంటాయని పోస్టర్ చూస్తుంటే పూర్తిగా అర్ధం అవుతుంది.బాలీవుడ్ స్టార్ నటుడు ఈ సినిమాలో నటించడం వల్ల నార్త్ లో కూడా ఈ మూవీ పై బజ్ ఏర్పడింది.


KGF తరువాత సౌత్ ఇండియా సినిమాకి మోస్ట్ వాంటెడ్ విలన్ గా సంజయ్ దత్ మారిపోయాడు.ఇక ఈ సినిమాలో విజయ్ సరసన  త్రిష జోడిగా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి UK లో భారీ బజ్ ఏర్పడింది. ఈ సినిమా ఖచ్చితంగా ఆల్ టైం డే 1 రికార్డ్ సెట్ చేయనుందని సమాచారం తెలుస్తుంది. విడుదలకి ముందే UK లో ఈ సినిమా భారీగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక సినిమాకి హిట్ టాక్ పడితే ఖచ్చితంగా తమిళ సినిమాల్లో డే 1 రికార్డుని ఈ సినిమా సెట్ చేస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

Leo

సంబంధిత వార్తలు: