నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. జాతి రత్నాలు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో అనుష్క తో కలిసి చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
 సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుందిమ్ UV క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని పి. మహేష్ బాబు తెరకెక్కించారు. సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ బడా ప్రొడక్షన్ హౌస్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరొందిన 'మైత్రీ మూవీ మేకర్స్' నవీన్ పొలిశెట్టితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని సదరు నిర్మాతలు తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'మిస్ట్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న నవీన్ పొలిశెట్టి కి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ.." త్వరలో నీతో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మీరంతా ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ కోసం సిద్ధంగా ఉన్నారా" అంటూ సోషల్ మీడియా  వేదికగా  పేర్కొన్నారు. అంతేకాకుండా నవీన్ పోలిశెట్టి కి బొకే ని అందిస్తూ కంగ్రాచ్యులేట్ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. 

దీంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాణ సంస్థ అయిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ లో ఇంత త్వరగా సినిమా చేసే అవకాశం నవీన్ కు తగ్గడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగతా వివరాలు ఏవి నిర్మాతలు ప్రకటించలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేసి మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: