తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో మంచు విష్ణు కూడా ఒకరు.ఆయన దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో భక్త కన్నప్ప సినిమాని తెరకెక్కుస్తున్నారని ప్రచారం జరిగింది.అయితే మంచు విష్ణు మార్కెట్ తో పోల్చి చూస్తే ఇంత భారీ బడ్జెట్ చాలా ఎక్కువని చాలామంది భావించారు. గత నెల 18వ తేదీన శ్రీకాళహస్తిలో ఈ సినిమా లాంఛ్ అనేది జరిగింది. ఇక ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఇందులో వింతేమి ఉంది అంటే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.హర హర మహాదేవ్ అంటూ విష్ణు రియాక్ట్ కూడా అయ్యారు. అంటే ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం తెలుస్తోంది. ప్రభాస్ విష్ణు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వైరల్ అవుతున్న ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలను బాగా షేక్ చేస్తోంది.
భక్త కన్నప్ప సినిమా కనుక విడుదలైతే సంచలనాలను సృష్టిస్తుందని చెప్పవచ్చు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ నటించడం వల్ల ఇతర భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. భక్త కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు దేవుడి పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యారు. ఆది పురుష్ లో రాముడిగా కల్కి లో విష్ణు మూర్తి పదవ అవతారం కల్కిగా ఇప్పుడు విష్ణు సినిమాలో ఏకంగా శివుడిగా నటించబోతున్నారు.ప్రభాస్ ఇంకా మంచు విష్ణు ప్రాణ స్నేహితులు కావడంతో తమ మధ్య ఉన్న స్నేహం వల్లే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం తెలుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం తెలుస్తుంది. సాయిమాధవ్ బుర్రా ఈ మూవీకి పని చేస్తున్నారని తెలుస్తోంది. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.