ఏంటి.. సాయి పల్లవి ఆ భారీ సినిమాను రిజెక్ట్ చేసిందా?

praveen
సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవి ఎంత మంచి గుర్తింపును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి జనరేషన్ లో స్టార్ హీరోయిన్గా మారాలి అంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని అందాల ఆరబోత చేయాల్సిందే అనే బావను కూడా తప్పు అని నిరూపించింది సాయి పల్లవి. తన నటనతో అవకాశాలు అందుకుంది. అదే సమయంలో ఇక తనకు ఏదైనా రొమాంటిక్ సీన్స్ ఉన్న పాత్రలు వస్తే.. నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి చేసిన పాత్రల కంటే వదులుకున్న పాత్రలే కాస్త ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామన్నా కూడా పట్టించుకోకుండా పెద్దపెద్ద సినిమాలను ఇప్పటివరకు రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అయితే ఇప్పటికే పుష్పా సినిమాలో శ్రీవల్లి పాత్రకు కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అన్న తెలిసిందే. ఈ కారణంతో సాయి పల్లవి రిజెక్ట్ చేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమా సీక్వల్గా తెరకెక్కుతుంది.

 నిజానికి ఈ సినిమా చేయాలి అనుకున్నప్పుడు దర్శకుడు పీ వాసు తొలుత సాయి పల్లవిని సంప్రదించాలి అనుకున్నారట. చంద్రముఖి పాత్ర మంచి నర్తకి కావడం.. అంతేకాదు ముఖ కవళికలతోనే హావభావాలు పంపించాల్సి ఉండడంతో... ఈ పాత్రకి సాయి పల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే సాయి పల్లవి కూడా గొప్ప డాన్సర్ అనే విషయం తెలిసిందే  అదే సమయంలో ఇక కళ్ళల్లోనే అభినయం పండించగల గొప్ప నటి కూడా. దీంతో పి వాసు సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె కథ విని సున్నితంగా తిరస్కరించారట. అయితే ఈ సినిమా చేసి ఉంటే మాత్రం సాయి పల్లవి రేంజ్ మరో లెవెల్ కు వెళ్లేదని అభిమానులకు కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: