ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడింది. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా 'ఖుషి'. ఈ సినిమాలో హాట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించింది.టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 1) విడుదలై.. తొలిరోజే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.ముఖ్యంగా విజయ్-సమంతల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి సినీ ప్రియులు బాగా ఫిదా అయ్యారు.ముఖ్యంగా అద్భుతమైన పాటలు, బీజీఎం ఇంకా బ్యూటిఫుల్ విజువల్స్ 'ఖుషి' సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.ఫస్ట్ డేనే సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి.
మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.30.1కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక ఏరియాల వారిగా చూస్తే.. 'నైజాం రూ.5.15 కోట్లు, సీడెడ్ రూ.91 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.1.13 కోట్లు, ఈస్ట్ రూ.66 లక్షలు, వెస్ట్ రూ.63 లక్షలు, గుంటూరు రూ. 66 లక్షలు, కృష్ణా రూ. 44లక్షలు, నెల్లూరు రూ.29 లక్షలు ఇంకా కర్ణాటక-రెస్టాఫ్ ఇండయాలో రూ.85 లక్షలు, ఇతర భాషల్లో రూ.45 లక్షల వసూళ్లను రాబట్టింది.ఇక ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద అయితే ఖుషి జోరు బాగా కనిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 6 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు ఈ సినిమా వేగంగా పరుగులు పెడుతోంది. ఖుషి సినిమాకి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే...మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ ఖచ్చితంగా సాధిస్తుందని అనుకోవచ్చు.కానీ ఈరోజుల్లో ఎంత హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమా అయినా ఖచ్చితంగా వారంలోపే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభల్లోకి రావాలి. అప్పుడే ఆ సినిమా హిట్ అయినట్టు.మరి చూడాలి ఈ సినిమా త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో.