OG గ్లింప్స్ తో అదరగొట్టేస్తున్న పవన్ కళ్యాణ్..!!
శత్రువులను కూడా ఊచకోత కోస్తున్నట్టుగా చూపించడం జరిగింది. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ తో పవన్ కళ్యాణ్ అదరగొట్టేస్తున్నారు.. ముఖ్యంగా లుక్స్ చితా లాంటి కళ్ళు ఒకరినొకరు నరుకుంటూ గ్లింప్స్ సైతం సోషల్ మీడియాని షేక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని చూపించలేదు.. OG చిత్రంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు డైరెక్టర్ సుజిత్.. ఈ టీజర్ విషయానికి వస్తే పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాను గుర్తుందా.. అది మట్టి చెట్లతో పాటు సగం ఊరును కూడా ఊడ్చుకు పోయింది కానీ వాడు నరికిన మనసుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాను కడగలేక పోయింది అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది.
మొత్తానికి ఈ గ్లింప్స్ యూట్యూబ్లో పలు రికార్డ్లను సైతం బద్దలు కొట్టడం ఖాయం అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్ ఇందులో హీరోయిన్గా మాళవిక మోహన్ నటిస్తోంది.. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ హస్మి నటిస్తుండగానే కాకుండా నటి శ్రీయ రెడ్డి కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. 1990 నాటి ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్ గా మొదలయ్యింది ఇప్పటికే పలు ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.