సలార్ వాయిదా కోసం వెయిట్ చేస్తున్న హీరోలు..!!
సలార్ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బుకింగ్స్ జోరు చూపిస్తోంది. ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టకుండా అభిమానులను నిరాశ పరుస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మేకర్స్ ఈ చిత్రాన్ని కొన్ని రోజులపాటు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అందుకే అక్టోబర్ 20వ తేదీ రావాల్సిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా సలార్ రిలీజ్ డేట్కు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ సలార్ సినిమా వాయిదా పడితే ఆ బెర్తులు ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఇక అక్టోబర్ 20వ తేదీన ఒకరోజు అటు ఇటుగా బాలయ్య భగవంత్ కేసరి, విజయ్ దళపతి లియో సినిమా కూడా రాబోతున్నాయి.. మరొకవైపు సెప్టెంబర్ 15న రామ్ పోతినేని నటించిన స్కంద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఒకవేళ సలార్ సినిమా రాకపోతే 15 నుంచి 28 కు వెళ్లి అవకాశం ఉన్నట్లు సమాచారం. స్కంద సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నది. మరి ఈ సినిమాలన్నీ కూడా సలార్ సినిమాల పైన ఆధారపడి ఉండడం గమనార్హం.