జైలర్ సినిమాకు ఊహించని షాక్..!!

Divya
గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ లేక చాలా సతమతమవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇటీవలే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా కాస్త ఊపిరి పోసిందని చెప్పవచ్చు.. ఈ చిత్రంతో తన స్టామినా ఏంటో మరొకసారి నిరూపించారు రజినీకాంత్. జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామిని సృష్టిస్తోంది.. ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపుగా రూ .600 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా తదితరులు సైతం నటించారు.

ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ వద్ద కలెక్షన్ల పరంగా భారీగానే రాబడుతోంది.. ఈ సినిమా త్వరలోనే ఓటీటిలోకి విడుదల కాబోతోందని ఒకవైపు వార్తలు వినిపిస్తూ ఉండగా తాజాగా ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా అందరు ఆశ్చర్యపోతున్నారు.. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్క్రీన్ షాట్ తీసి మరి సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తూ ఉండడంతో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దండి అంటూ పైరసీ లింక్స్ షేర్ చేయవద్దని అభిమానులు సరిత విజ్ఞప్తి చేస్తున్నారు.

అంతేకాకుండా చిత్ర బృందం ఓటీటి లో కూడా ఈ సినిమాకు సంబంధించి 5.1 ఆడియోతో అల్ట్రా హెచ్డి ప్రింట్ ను అప్లోడ్ చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జైలర్ సినిమాను పెయిడ్ చెల్లింపులతో విడుదల చేస్తారా లేకపోతే ఫ్రీగా విడుదల చేస్తారా అనే విషయం ఇంకా తెలియడం లేదు ఏది ఏమైనా హెచ్డి ప్రింట్ వల్ల జైలర్ సినిమా కలెక్షన్ల పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సన్ నెక్స్ట్ వీలైనంత త్వరగా ఈ సినిమాను ఓటీటి లోకి తీసుకువస్తుందేమో చూడాలి మరి. అయితే హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రిమ్మింగ్  కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: