అనీల్ రావిపూడి మోక్షజ్ఞ మధ్య పెరిగిపోతున్న సాన్నిహిత్యం !
ఇలాంటి పరిస్థితుల మధ్య అనీల్ రావిపూడి బాలయ్యతో తీస్తున్న ‘భగవంత్ కేసరి’ షూటింగ్ స్పాట్ లో తరుచూ మోక్షజ్ఞ కనిపిస్తూ ఉండటమే కాకుండా షూటింగ్ సమయంలో ఆసినిమా యూనిట్ సభ్యులతో ముఖ్యంగా అనీల్ రావిపూడితో మోక్షజ్ఞ క్లోజ్ గా కనపడటం చూసినవారికి సరికొత్త సందేహాలు ఏర్పడుతున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా ఉండబోతోందా అంటూ మరికొందరు అప్పుడే ఊహాగానాలు మొదలు పెట్టారు.
జాతకాలు ముహూర్తాల పై నమ్మకం ఉన్న బాలకృష్ణకు మోక్షజ్ఞ జాతకం రీత్యా వచ్చే సంవత్సరం అతడి ఎంట్రీ ఉంటే అన్ని విధాల బాగుంటుంది అని బాలయ్యకు కొందరు జ్యోతిష్కులు చెప్పారు అని అంటారు. దీనితో మోక్షజ్ఞ కు సరిపోయే ఒక లవ్ స్టోరీ అన్వేషణలో బాలయ్య ఉన్నాడు అని అంటారు. ఇప్పటికీ వరకు లవ్ స్టోరీ సినిమాల జానర్ ను ఎంచుకోని అనీల్ రావిపూడితో తన కొడుకు ఎంట్రీ ఇవ్వాలని బాలయ్య ఆలోచన అని కూడ అంటున్నారు.
వాస్తవానికి బాగా పేరు తెచ్చుకున్న టాప్ దర్శకులు యంగ్ హీరోలతో అదేవిధంగా టాప్ హీరల వారాసులతో సినిమాలు చేయడానికి అంత ఆశక్తి కనపరచడం లేదు. ఇలాంటి పరిస్థితిలలో బాలకృష్ణ ఒత్తిడి ని తప్పించుకోలేక అనీల్ రావిపూడి మోక్షజ్ఞ కు కథ వెతికే పనిలో బిజీగా ఉన్నాడా అన్న సందేహాలు కూడ కొందరికి కలుగుతున్నాయి. రాజమౌళి తరువాత వరస హిట్స్ తో దూసుకు పోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి కాబట్టి బాలయ్య ఆలోచనలు అనీల్ రావిపూడి వైపు ఉన్నాయి అనుకోవాలి..