మరో యాక్షన్ ట్రైలర్ ని ఫిక్స్ చేసిన జవాన్ మేకర్స్..!!

Divya
తమిళ డైరెక్టర్ అట్లీ ,బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం జవాన్.. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తూ ఉండగా విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు. అలాగే ప్రియమణి ,యోగిబాబు తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే అతిధి పాత్రలో నటించబోతోంది. దాదాపు ఈ సినిమా పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూనే ఉన్నది చిత్ర బృందం.
అలాగే ఈ సినిమా నుంచి ప్రివ్యూ అంటూ ఒక ట్రైలర్ ని కట్ చేసిన మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. దీంతో ఈ ప్రివ్యూ వీడియో పైన భారీ హైప్ ఏర్పడుతోంది అయితే.. ట్రైలర్ అప్పుడే అయిపోలేదు మరో ట్రైలర్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ని పవర్ ఫుల్ యాక్షన్ తో కట్ చేసి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ ట్రైలర్ ని రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు కానీ బాలీవుడ్ మీడియాలో ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది ..ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. రివ్యూ ట్రైలర్లో బోడి గుండు గెటప్ లో కనిపించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు షారుక్ ..ఈ సినిమా కథ నచ్చడం వ్యవహరిస్తూ ఎంటర్టైన్మెంట్ ప్రతాపం పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో విజయ్ తలపతి కూడా అత్తిలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయం చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలబడలేదు సెప్టెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: