నందమూరి వేడుకకు తారక్ దూరంగా ఉండడానికి.. కారణం అదేనా?

praveen
తెలుగు సినీ ప్రేక్షకులకు నట సార్వభౌముడు.. తెలుగు ప్రజలకు ప్రియతమ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఇటీవల జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు చేసిన సేవలకు స్మారకంగా కేంద్ర ప్రభుత్వం ఆయన చిత్రంతో కూడిన ఒక నాణేన్ని విడుదల చేసింది. అయితే ఈ వేడుకకు అటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఎంతో మందికి ఆహ్వానం అందింది అని చెప్పాలి. అయితే నందమూరి ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ ఒక్క తారక్ మాత్రం వేడుకలో ఎక్కడ కనిపించలేదు.

 దీంతో ఇక తన తాతగారి వేడుకకు తారక్ అసలు ఎందుకు దూరంగా ఉన్నారు అంటూ ఒక చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్లో బిజీగా ఉన్నారు.  ఈ సినిమాకు సంబంధించిన యాక్సిడెంట్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. అయితే తాను ₹100 నాణెం విడుదల వేడుకకు రావడం కొంతమందికి ఇష్టం లేకపోవడంతోనే.. చివరికి ఈవెంట్ కు ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తారక్ మాత్రం ఎందుకు ఆ ఈవెంట్ కు హాజరు కాలేదు అనే విషయంపై ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

 ఇకపోతే త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్.. ఇక తన కెరీర్ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏడాదికి ఒక్కో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా కెరియర్ ప్లానింగ్ చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర   సినిమాలో నటిస్తూ ఉండగా మరికొన్ని సినిమాలకు సంబంధించి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే పారితోషకం కూడా భారీ రేంజ్ లో పెంచేసిన తారక్ మరోసారి రాజమౌళితో సినిమాకు రెడీ అవుతున్నాడు అంటూ ఒక భోగట్ట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: