దగ్గుబాటి లక్ష్మి కంటే ముందు.. ఆ హీరోయిన్ తో నాగ్ పెళ్లి చేయాలనుకున్న ఏఎన్ఆర్?

praveen
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కేంద్ర నాగార్జున గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు నాగార్జున. ఇక ఫిట్నెస్ విషయంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా పాతికేళ్ల కుర్రాడిలాగే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఇప్పటికి ఎంతోమంది అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు నాగార్జున. అయితే నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే  అయితే ఇక ఇద్దరూ కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్ గా కూడా పేరు సంపాదించుకున్నారు.

 అయితే అమలను పెళ్లి చేసుకోవడానికి అంటే ముందే నాగార్జున వెంకటేష్ సోదరి దగ్గుబాటి రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మి వివాహం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే నాగచైతన్య పుట్టిన తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో చివరికి విడాకులు తీసుకుని వేరే పడ్డారు. ఇక ఆ తర్వాతే అమలతో ప్రేమలో పడటం.. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత లైఫ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఎవరికి తెలియని ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 దగ్గుబాటి లక్ష్మీతో పెళ్లి కంటే ముందే నాగార్జునకు ఒక హీరోయిన్ తో పెళ్లి చేయాలని సంబంధం చూశారట ఏఎన్ఆర్. ఆ హీరోయిన్ ఎవరో కాదు సుమలత. స్టార్ హీరోయిన్గా అప్పట్లో సుమలత చలామణి అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ తో నాగార్జునకు పెళ్లి చేయాలని ఏఎన్ఆర్ భావించారట. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే విదేశాల్లో నాగార్జున చదువుకుంటున్న సమయంలో.. ఓ రోజు ఏఎన్ఆర్ సుమలత దగ్గరికి వెళ్లి నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా వాడు విదేశాల్లో ఉన్నాడు. నీకు బాగా సెట్ అవుతాడు. వాడు వచ్చాక పెళ్లి చేస్తా అంటూ అందరి ముందే అడిగాడట. అందరి ముందు ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సుమలత.. సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లి పోయిందట. తర్వాత కూడా ఈ విషయంపై మాట్లాడలేదట. తర్వాత నాగార్జున విదేశాల నుంచి రావడం లక్ష్మిని పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: