అభిమానులను అయోమయంలో పడేసిన కార్తికేయ....!!

murali krishna
కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 చిన్న సినిమా గా రిలీజయి భారీ విజయం సాధించింది. పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా తర్వాత నటుడు కార్తికేయ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు అయితే తాజాగా ఈయన బెదురు లంక 2012 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇలా ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల లో భాగంగా కార్తికేయ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు ఆర్ఎక్స్ 100 సినిమా సీక్వెల్చిత్రం గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈయన సినీ కెరియర్ కు మైల్ స్టోన్ గా నిలిచినటువంటి ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100 సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ తాను మాత్రం ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి తో  తిరిగి మరో సినిమా కచ్చితంగా చేస్తానని కార్తికేయ తెలిపారు. ఇప్పటికే అజయ్ భూపతి తనకు కొన్ని కథలను వినిపించారని కథ ఫైనల్ అయిన తర్వాత ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తాము అంటూ కార్తికేయ వెల్లడించారు. కానీ ఆర్ ఎక్స్ 100 సీక్వెల్ ఉంటుందో లేదో తనకైతే తెలియదు అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్ చేయడంతో ఆర్ఎక్స్ 100 సీక్వెల్ ఉంటుందా లేదా అన్న అయోమయంలో అభిమానులు పడిపోయారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: