డైరెక్టర్ అవ్వకముందు.. పూరి జగన్నాథ్ ఏం చేసేవాడో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ టక్కున పూరి జగన్నాథ్ పేరు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఒకప్పుడు పూరి సినిమాల ద్వారా సూపర్ హిట్లు సాధించి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. హీరో పాత్రలను న్యాచురల్ గా చూపిస్తూనే.. పవర్ ఫుల్ గా ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ దిట్ట అని చెప్పాలి.

 అంతేకాదు అది తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టగల దర్శకుడు కూడా పూరినే అని ఎంతో మంది సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక పూరి జగన్నాథ్ మేకింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.. ఆయన సినిమాలోని డైలాగ్స్ హీరోల క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం యువతకి బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడంటే పూరీ తీస్తున్న సినిమాలు పెద్దగా ఆడటం లేదు. కానీ ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు ఈ డైరెక్టర్. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమాతో సూపర్ హిట్ సాధించిన పూరి తర్వాత మహేష్ తో పోకిరి చేసి ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు.

 ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పూరి జగన్నాథ్ డైరెక్టర్ అవ్వకముందు ఏం చేసేవాడు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే డైరెక్టర్గా అవతారం ఎత్తకముందు పూరి రచయితగా ఉండేవాడట. ఎంతోమంది దర్శకులకు కథలు రాసేవాడట. ఇలా కథలు రాయడానికి 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పారితోషకం తీసుకునేవాడట. కథకు తగ్గట్టుగా షార్ట్ యానిమేషన్ బొమ్మలు కూడా గీసేవాడట. ఇలా బొమ్మలు గీసినందుకు 50 రూపాయలు అందుకునే వాడట పూరి జగన్నాథ్  ఈ విషయాన్ని ఇటీవల పూరినే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: