రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అదిరిపోయి రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ.కి సంబంధించిన మొదటి భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కే అనే పాన్ వరల్డ్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అమితా బచ్చన్ , దిశా పటాని ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. దీపికా పదుకొనే ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీ తో పాటు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ప్రభాస్ హీరో గా నటిస్తున్నాడు. అలాగే ఈ మూవీ ల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ అనే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్ని కమిట్మెంట్ లతో ఉన్న ప్రభాస్ కి తాజాగా ఓ స్టార్ నటుడు మరియు దర్శకుడు అదిరిపోయే యాక్షన్ ఓరియంటెడ్ కథను వినిపించాడట.
అసలు విషయం లోకి వెళితే ... స్టార్ నటుడిగా ... దర్శకుడిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ప్రభాస్ కి ఓ పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఓరియంటెడ్ కథను వినిపించాడట. హీరోకి కథ అద్భుతంగా నచ్చిందట ... కాకపోతే ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న కమిట్మెంట్ ల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం పృధ్విరాజ్ సుకుమారన్ ... ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.