బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి అల్లుఅర్జున్ మరలా ఛాన్స్ ఇస్తాడా....!!
అయినా కూడా ఈయన చిరంజీవి తో చేసిన సైరా నరసింహ రెడ్డి సినిమా ప్లాప్ అయ్యింది ఇక అలాగే ఈ సినిమా తర్వాత భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా కూడా ప్లాప్ అవ్వడం తో ప్రస్తుతం ఆయన ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను రెఢీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది నిజానికి ఈయన రవితేజ, కళ్యాణ్ రామ్ ,అల్లు అర్జున్,రామ్ చరణ్ లాంటి ఒక సూపర్ స్టార్లకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చిన వ్యక్తి గా ఇండస్ట్రీ రికార్డులలో కూడా ఆయన పేరు నిలిచింది.
ఇక ఇది ఇలా ఉంటే ఆయన నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేసే సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ వస్తున్నట్టు గా తెలుస్తుంది... ఇప్పటికే వీళ్ళ కాంబో లో వచ్చిన రేసు గుర్రం లాంటి సినిమా అప్పటి వరకు అల్లు అర్జున్ కెరియర్ లోనే ఒక సూపర్ హిట్ గా నిలిచింది... ఇక ఈ సినిమా తో ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా అల్లు అర్జున్ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు...ఇక అదే నమ్మకం తో అల్లు అర్జున్ కూడా ఈయనతో సినిమా తీయడానికి రెఢీ అవుతున్నట్టు గా తెలుస్తుంది .