బ్రో ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అంటే..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వంటి హిట్ సినిమా తర్వాత తన మేనల్లుడు సాయి ధరంతేజ్తో కలిసి నటించిన చిత్రం బ్రో ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు కేతికాశర్మ ప్రియాంక వారియర్ హీరోయిన్గా నటించగా తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వినోదయాసీతం రీమేక్ గా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. మొదటి మూడు రోజుల్లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా జూలై 28న విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లోనే రూ .100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చిన ఈ సినిమా పవన్ వింటేజ్ లుక్ ,  యాక్టింగ్ , మేనరిజం అన్నీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

మరొకవైపు విరూపాక్ష సినిమాతో రూ .100కోట్ల క్లబ్లో చేరిన సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాలో సెటిల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. మొత్తానికైతే సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ కు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అప్డేట్ వైరల్ గా మారింది. బ్రో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను  ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకుందని సమాచారం.

ఆగస్టు 25 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావల్సి వుండగా.. పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకొని సెప్టెంబర్ 2న ఈ సినిమాను ఓటీటిలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.  కానీ ఇదంతా పుకార్లు మాత్రమేనని ఆగస్టు 25 నుంచే నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోందని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికి అయితే ఈ సినిమా కోసం ఓటీటీ లో చూడడానికి ఎదురుచూస్తున్న అభిమానులకు మంచి ఊరట లభించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: