అఫిషియల్ : "విరూపాక్ష" మూవీ దర్శకుడి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కార్తీక్ దండు ఒకరు. ఈయన భమ్ బోలేనాథ్ అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది . ఈ మూవీ తర్వాత చాలా సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా రూపొందిన విరూపాక్ష అనే సస్పెన్స్ హార్రర్ ధ్రిల్లర్ జోనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది . ఇకపోతే ఈ మూవీ తో ఈ దర్శకుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన రీతిలో పెరిగి పోయింది . ఇకపోతే విరూపాక్ష సినిమా విడుదల అయ్యి ఇప్పటికే కొంత కాలం అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడికి సంబంధించిన కొత్త మూవీ అప్డేట్ బయటకు వచ్చింది.
 


కార్తీక్ ఈ సారి మైథికల్ థ్రిల్లర్ జోనర్ మూవీ ని రూపొందించబోతున్నట్లు ... ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ని బివిఎస్ఎన్ ప్రసాద్ ... సుకుమార్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. విరూపాక్ష లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఈ దర్శకుడు నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలను మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: