ఎవరు ఊహించని డైరెక్టర్ తో మళ్ళీ అదే రిస్క్ చేస్తున్న చిరంజీవి..!?

Anilkumar
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా రచ్చ ఎక్కువైంది అని చెప్పాలి. అంత డిజాస్టర్ మిగలడంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో వస్తున్నాయి .అయితే ఈ సినిమా రిసల్ట్ తో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏం చేస్తారో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. ఎలాగో ఈ సినిమా తరువాత తన కూతురు సుస్మిత కొణిదల నిర్మాణంలో బంగారు రాజు ఫేక్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ సినిమాల లైన్లోకి పలువురు దర్శకుల పేర్లు కూడా ఇప్పుడు వినబడుతున్నాయి. 


ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సీనియర్ యాక్షన్ దర్శకుడు పేరు కూడా వనబడడంతో ఆ విషయం  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆదర్శకుడు మరెవరో కాదు వీవీ వినాయక్. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా వివి వినాయక దర్శకత్వంలోనే వచ్చిన సంగతి తెలిసిందే .ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి అయితే గతంలో ఆది ఠాగూర్ అదుర్స్ వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న వివి వినాయక్ తాజాగా బాలీవుడ్ ఆరంగేట్రం కూడా చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో  ఒక సూపర్ హిట్ సినిమా అయినా చత్రపతికి హిందీ రీమేక్ చేయడం జరిగింది. కానీ ఆ సినిమా అక్కడ డిజాస్టర్ గా నిలిచింది.


దీంతో వినాయక్ తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంతగా ఫామ్ లో లేరు కాబట్టి పెద్ద హీరోలు ఎవరు కూడా ప్రస్తుతం ఆయనతో టచ్ లో లేరు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి నిజంగా వినాయక్ కి అవకాశం ఇస్తారా ఒకవేళ ఇస్తే ఎటువంటి కథ చేస్తారు అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఇప్పటికే వినయక్ పేరు ప్రచారంలోకి రాకముందే చాలా రోజుల నుండి మెగాస్టార్ తన 150 ఏడవ సినిమాని బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై సోషల్ ఫాంటసీ మూవీగా ఈ సినిమా రాబోతుంది అన్న టాక్ కూడా వినబడుతోంది. అయితే ఇప్పుడు చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్టకు కూడా అవకాశం ఇస్తారా లేక సీనియర్ దర్శకుడు వినాయాక్ తో సినిమా చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: