సీతారామం-2 సినిమా రాబోతోందా.. మరి నటీనటులు..!!

Divya
గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం సీతారామం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాగపూడి దర్శకత్వం వహించారు. ఇందులో హీరో దుల్కర్ సల్మాన్ హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తోంది. కీలకమైన పాత్రలో రష్మిక కూడా నటించింది

2002లో విడుదలైన ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ పైన నిర్మించడం జరిగింది. కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టాయి.మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కి కూడా వరుస అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి.. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది అంటూ డైరెక్టర్ హానురాఘవపూడి ఒకానొక సందర్భంలో తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటే ఈ సినిమాకు ఇష్టపడే అభిమానులు కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం డైరెక్టర్ హాను రాఘవపూడి కూడా సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ గా పేరు పొందారు.
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో కూడా స్టార్ టేరెస్టును అందుకొని పలు చిత్రాలలో నటిస్తోంది సీతారామన్ చిత్రంలో సీత పాత్రలు ఒదిగిపోయి పర్ఫెక్ట్ యాక్టింగ్ అనిపించేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో వరుసగా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ కూడా మహానటి సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ నీ అందుకున్నారు ఇక ఆ తర్వాత మలయాళం లో తన చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కోట అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మొదటిసారి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: