మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 4.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సిడెడ్ ఏరియాలో 2.02 కోట్లు , యుఏ లో 1.84 కోట్లు , ఈస్ట్ లో 1.32 కోట్లు , వెస్ట్ లో 1.85 కోట్లు , గుంటూరు లో 2.08 కోట్లు , కృష్ణ లో 1.03 కోట్లు , నెల్లూరు లో 73 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది మొత్తంగా ఈ సినిమా విడుదల. అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 15.38 కోట్ల షేర్ ... 22.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 1.05 కోట్లు , ఓవర్సీస్ లో 1.95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 18.38 కోట్ల షేర్ ... 28 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 79.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ మూవీ 80.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా మరో 62.12 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ ... సుశాంత్ కీలక పాత్రలలో నటించారు.