USA: అజిత్- విజయ్ రికార్డులకు చెక్ పెట్టిన రజిని..!!
మొదటి రోజు 1.5 మిలియన్ డాలర్లతో ఈ సినిమా ముగియగా ఇక ఆ తర్వాత రోజు నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ప్రభంజనం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ దళపతి నటించిన వారిసు 1.14 మిలియన్లు.. అజిత్ నటించిన తునివు 880 k బాక్సాఫీస్ కలెక్షన్లను సైతం జైలర్ సినిమా అధికమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 5 దశాబ్దాలుగా బాక్సాఫీస్ ని అజిత్, విజయ్ ఎలా శాసిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికాలో ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రంగా పేరు సంపాదించింది జైలర్ సినిమా.
దాదాపుగా 4.5 మిలియన్ డాలర్లు ప్రకారం మన ఇండియన్ కరెన్సీ తో రూ.38 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. జైలర్ ఈ ఫిట్ సులువుగా సాధ్యమైందని అమెరికా ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. జైలర్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ .72 కోట్లకు పైగా క్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా మార్నింగ్ షో లేకున్నా కూడా 24 కోట్ల రూపాయల కలెక్షన్ చేసినట్లు తమిళనాడులో వార్తలు వినిపిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.5 కోట్ల రూపాయలు వసూలు అయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పైన కూడా రజిని అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.