పెళ్లి చేసుకునేది అప్పుడే అంటున్న విజయ్ దేవరకొండ...!!

murali krishna
ఈ జనరేషన్ హీరోలలో పెళ్లి కానిప్రసాదుల లిస్ట్ చాలా ఉంది. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. కాని కెరీర్ లో స్టార్ డమ్ వచ్చినా.. చాలా కాలంగా సాలిడ్ హిట్ పడలేదు విజయ్ కు.అయితే విజయ్ అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతుంటారు. కొంత మంది అయితే... విజయ్ ను పెళ్ళి చేసుకుంటే చంపేస్తామని వార్నింగ్ లు కూడా ఇచ్చారు. అంతలా అమ్మాయిల్లో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. అయితే ఆయన ఎక్కడికి వెళ్లినా కామన్ క్వశ్చన్ ఒకటి వినిపిస్తుంటుంది. అదే పెళ్ళెప్పుడని. గతంలో ఈ ప్రశ్న వినిపిస్తే.. కాస్త కోపంగా సమాధానం చెప్పేవాడు విజయ్. కాని ఈసారి మత్రం చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా కలిసి నటించిన సినిమా ఖుషి. ఈసినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ లభించని విజయ్ కు .. ఈసారి కాస్త రిలీజ్ వస్తుంది అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ లైగర్ ఫ్లాప్ తర్వాత ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో విజయ్ రాబోతున్నాడు. సమంత కూడా శాకుంతలం ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుండటంతో ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఇద్దరికి హిట్ అవ్వసరం. ఈసినిమా ఇద్దరికి ఎంతో ముఖ్యమైనది. కచ్చితంగా ఖుషీ హిట్ అవ్వాల్సిందే. లేకుంటే కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడుతుంది అని భావిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. తాజాగా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు టీమ్. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. అందులో ఓ సాంగ్ పాన్ ఇండియా లెవల్లో మారుమోగుతోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఖుషీ ట్రైలర్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ దో దూసుకుపోతోంది. ప్రేమ పెళ్లి.. సంసార జీవితం.. గొడవలు కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. మరోసారి ఈసినిమా తో తన మార్క్ చూపించబోతున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈక్రమంలో కుషీ ట్రైలర్ రిలీజ్ లో ఇంట్రెస్టింగ కామెట్స్ చేశాడు విజయ్ దేవరకొండ.
ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు చిత్రయూనిట్. ఓ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగాడు. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలన్నా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇటీవల పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారితో పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తుంటాను.
కొంతమంది లైఫ్ లో జరిగే సంఘటనలు చూసి పెళ్లి అంటే భయం పోయింది అన్నారు విజయ్. పెళ్ళికి పడకూడదు. పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి. అది అందరూ ఆస్వాదించాలి. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ముడేళ్ళల్లో నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేనే అందరికి చెప్తాను అని తెలిపాడు. దాంతో విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఇప్పటి నుంచే విజయ్ ను చేసుకోబోయేది ఎవరా అని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. ఇక హీరోయిన్ రష్మికతో విజయ్ డేటింగ్ లో ఉన్నట్టు చాలా కాలంగా టాక్ నడుస్తోంది. కొన్ని సంఘటనలు కూడా వారిపై అనుమానం కలిగేలా చేస్తున్నాయి. మరి వీరి రిలేషన్ నిజం అయితే.. ఎప్పుడు ఓపెన్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: