ఆ వివరాలు ఇస్తేనే టికెట్ ధర పెంపు.. భోళా పరిస్థితి ఏమిటి..?

Divya
రేపటి రోజున చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టికెట్లు ధరలను పెంచాలని ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకోగా ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కాస్త వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అందుకు కారణం చిత్ర యూనిట్ నుంచి తమకు అందిన దరఖాస్తులో పూర్తి వివరాలన్నీ ఇవ్వకపోవటమే అన్నట్లుగా తెలియజేస్తోంది.టికెట్ ధరల్ని పెంచేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతిని కోరుతూ ఇచ్చిన దరఖాస్తులు పూర్తి వివరాలు లేనట్టుగా ఉన్నట్లు సంబంధిత అధికారులు సైతం తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక సినిమా టికెట్ ధరల్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం అంగీకరించాలి అంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంది.. ముఖ్యంగా అందులో ఆంధ్రప్రదేశ్లో 20% సినిమా షూటింగ్ను చేసిన వివరాలు నటీనటుల రెమ్యూనరేషన్ కాకుండా మొత్తం షూటింగ్ నిర్మాణ వ్యయం రూ .100 కోట్లు ఉండాలి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తమకు అందిన వివరాలలో అలాంటివి ఏవి లేవని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. బడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండానే కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చారని.. మిగిలిన వాటిని కూడా ఇస్తే టికెట్ పెంపు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతున్నది అయితే ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకలు చిరంజీవి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు పిచిక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినీ ఇండస్ట్రీ మీద అందరూ పడుతున్నారేంటి అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఈ వాక్యాల వల్ల చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా పైన ప్రభావం చూపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏమి అరకు ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: