పునీత్ ఫ్యామిలీని వెంటాడుతున్న వరుస మరణాలు.. మనోవేదనతో కుటుంబీకులు..!!
ముఖ్యంగా పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి నిన్నటి రోజున స్పందన మరణం వరకు వరుస విషాదాలు ఈ ఇంట్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో ఈ కుటుంబ సభ్యుల సైతం తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పునీత్ కుటుంబం పునీత్ రాజు గుండెపోటుతో మరణించడంతో ఇప్పటికీ చాలామంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత అశ్వని తీవ్ర మనోవేదనకు లోనైనట్టుగా తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది నెలలకే ఆమె తండ్రి కూడా మరణించారు భర్తను పోగొట్టుకున్న బాధలో అండగా ఉండే అశ్వని తండ్రిని కోల్పోవడంతో మరింత దిగ్బ్రాంతికి లోనయ్యింది.
ఆ తర్వాత పార్వతమ్మ రాజ్ కుమార్ కుమారుడు నూరజ్ గతి కొద్ది రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోవడం జరిగింది. జూన్ 24న బైక్పై వెళ్తూ ఉండగా లారీ ఢీకొట్టడంతో అతని కుడికాలు నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో అతడి కాలు తీసేయవలసి వచ్చిందని సమాచారం. హీరోగా ఎదగాల్సిన నూరజ్ కళలు ఈ యాక్సిడెంట్ ఒక్కసారిగా చితిని వేసింది. విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన తన కుటుంబంతో కలిసి బ్యాంకాక్ వెళ్ళగా అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించేగా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇలా పునీత్ కుటుంబంలోని ఎందుకు వరుసగా విషాదాలు జరుగుతున్నాయో అభిమానులకు అర్థం కావడం లేదు.