దేవర సినిమాలో అదే హైలెట్ గా ఉండబోతుందా..!!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుందని డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే తెలియజేయడం జరిగింది. సముద్రపు భూభాగంలో జరిగే ఒక కథ అని కూడా తెలియజేశారు.. ఇందులో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని ఇప్పటికీ మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసిందని అందులో అన్ని యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది అదేమిటంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ కి షార్క్ తో సముద్రంలో ఒక ఫైట్ ఉందని..
చత్రపతి సినిమాలో ప్రభాస్ తిమింగలంతో ఎలా ఫైట్ చేస్తారు ఎన్టీఆర్ కూడా సముద్రంలో ఒక ఫైట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ ఆక్వా మ్యాన్ గా కూడా కనబడతాడేమో అని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఇదే హైలైట్ గా నిలవబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫైట్ సీక్వెల్స్ లో ఎక్కువగా గ్రాఫిక్స్ కూడా ఉంటుందని.. కొరటాల శివ ఎక్కువగా గ్రాఫిక్స్ పైన కూడా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం నిజమో కాదు తెలియదు కానీ ఎన్టీఆర్ తో షార్క్ ఉంటే మాత్రం అదిరిపోతుందని అభిమానులు తెలియజేస్తున్నారు.