HBD Genelia: హీరోయిన్ జెనీలియా.. ఇక ఇండస్ట్రీకి దూరమేనా..?

Divya
HBD Genelia: ప్రముఖ హీరోయిన్ జెనీలియా దేష్ ముఖ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో , అందంతో చిలిపితనంతో ఎంతోమంది కుర్ర కారును నవ్వించి కవ్వించిన ఈ ముద్దుగుమ్మ ఈరోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయింది అనే విషయాల గురించి చర్చించుకుందాం. ఢీ, సై, రెడీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగులోనే కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఈ పేరు చెబితేనే హహ హాసిని అంటూ అమాయకంగా నవ్వే బొమ్మరిల్లు హీరోయిన్ గుర్తుకొస్తుంది. అంతలా తన నటనతో ప్రేక్షకులను అలరించింది.
ఇక రానా సరసన చివరిగా నా ఇష్టం అనే సినిమాలో నటించి తెలుగు పరిశ్రమకు పూర్తిగా దూరమైన జెనీలియా రితేష్ దేశముఖ్ ను వివాహం చేసుకున్న తర్వాత వ్యక్తిగత జీవితానికే తన సమయాన్ని కేటాయిస్తోంది. ఇక ఇటీవల తన భర్త రితేష్ తో కలిసి వేద్ అనే చిత్రంలో నటించిన ఈమె తెలుగులో నాగచైతన్య , సమంత కలిసి నటించిన మజిలీ చిత్రానికి మరాఠీ రీమేక్ కావడం గమనార్హం. వేద్ సినిమా మంచి విజయం సాధించడమే కాదు జెనీలియా నటనకు పూర్తిస్థాయిలో గుర్తింపు కూడా లభించింది.
ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ.. జీవితంలో ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాల్సిందే రెండు పడవల మీద ప్రయాణం సాగించడం కష్టం.. పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాను. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం  కుదరడం లేదు.. అందుకే సినిమాలు చేయడం మానేశాను ఇలా చేయడం వల్లే ఇవాళ ఒక మంచి ఇల్లాలిగా కుటుంబంలో మంచి పేరు తెచ్చుకున్నాను. కొడుకుల బాగోగులను చూసుకోగలుగుతున్నాను.. భర్తకు తోడుగా ఉండగలుగుతున్నాను.. ఇంతకంటే గొప్ప జీవితం ఇంకొకటి నాకేం కావాలి అంటూ జెనీలియా వెల్లడించింది. ఇకపోతే ఎప్పటికైనా తాను ఇష్టపడే మంచి కథ దొరికితే ఒక సినిమాలో మాత్రమే నటిస్తానని చెప్పింది. తాను అనుకున్న కథ దొరికే వరకు ఆమె ఇండస్ట్రీకి దూరంగానే ఉండబోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: