సౌత్ లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాయనతార ఇటీవల టాలీవుడ్ లో పెద్దగా సినిమాలను చేయడం లేదన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు ఎన్టీఆర్ ప్రభాస్ వంటి యంగ్ స్టార్ హీరోలతో కూడా చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది నయనతార. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలో చేయడమే మానేసింది. కోలీవుడ్ సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది నయనతార. హిందీలో మొదటి సినిమానే ఏకంగా షారుక్ ఖాన్
వంటి స్టార్ హీరోతో చేస్తోంది. అదే జవాన్ సినిమా. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. హై బడ్జెట్ తో పాటు యాక్షన్ త్రిల్లర్ గారు పొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా గనక మంచి విజయాన్ని అందుకుంటే నాయనతార బాలీవుడ్లో సెటిల్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఈ క్రమంలోనే నయనతార తెలుగు సినిమాల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదని అంటున్నారు. ఒకవేళ తెలుగు సినిమాల్లో ఆఫీస్ వచ్చినప్పటికీ కొన్ని షాకింగ్ కండిషన్స్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే తెలుగులో నటించాలి అంటే ఆ సినిమాలో హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ తనకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుందిట నయనతార. అప్పుడే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. ఇలా అయితే కుదరని పని అని మేకర్స్ సైతం ఇందుకు ఒప్పుకోవడం లేదంట. ఎందుకంటే టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరూ 50 నుండి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక అంతే రెమ్యూనరేషన్ నయనతారకు కూడా ఇస్తే నిర్మాతలు రోడ్డున పడడం ఖాయం. అందుకే నయనతార కొత్త కండిషన్కు తెలుగు దర్శక నిర్మాతలు ఏమాత్రం ఒప్పుకోవడం లేదని అంటున్నారు..!!