రీమేక్ సినిమా చేయడం వల్లే ' బ్రో ' మూవీ కి అలాంటి పరిస్థితి....!!
బ్రో సినిమా కు సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ ప్రచారం లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బ్రో సినిమా లో ఇచ్చిన సందేశం సైతం మరీ అద్భుతంగా లేదు. కాలం అనుకున్న విధంగానే మన జీవితంలో జరుగుతుందంటే కష్టపడిన వాళ్లకు కష్టపడని వాళ్లకు తేడా ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రో మూవీలో కమర్షియల్ అంశాలు ఎక్కువ గానే ఉన్నాయని సమాచారం. బ్రో సినిమా ఆశించిన రిజల్ట్ ను అందుకోకపోవడం తో సముద్రఖనికి తెలుగు లో ఆఫర్లు రావడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రో తరహా సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలంటే కథ, కథనం విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలు భారీగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.